హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులు ఈ-కేవైసీ చేయించుకోవాలి: ఏవో

కృష్ణా: రైతులు ఈ-కేవైసీ చేయించుకోవాలని చల్లపల్లి ఏవో అధికారి కే.మురళీకృష్ణ కోరారు. శనివారం చల్లపల్లి మండలం పాగోలులో పొలంబడి నిర్వహించారు. మండలంలో ఈ-క్రాప్ చేయించుకున్న 15,087 మంది రైతులు ఈ-కేవైసీ చేయించుకోవాలన్నారు. పంటల బీమాకు, ధాన్యం సేకరణకు, పంట నష్టపోతే ప్రభుత్వ సహాయానికి ఈ-కేవైసీ తప్పనిసరి అని తెలిపారు. వరి చిరుపొట్ట దశలో పొటాష్ చల్లుకువాలన్నారు.