హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కొబ్బరి నీళ్లు వీరు అసలు తాగకూడదు..!

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే అయినా కొందరు వీటికి దూరంగా ఉండాలి. పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల కిడ్నీ సమస్యలున్న వారికి ఇది ప్రమాదకరం. ఇందులో సహజ చక్కెరలు ఉంటాయి, కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు పరిమితంగానే తాగాలి. బీపీ మందులు వాడేవారు, పక్షవాతం, గుండె సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. కేలరీలు ఎక్కువ ఉన్నందున అధిక బరువున్న వారు తక్కువగా తాగడం మంచిది.