హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్ సమీపంలో దుర్వాసన.. పట్టించుకోరా?

VKB: జిల్లా కలెక్టరేట్ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్స్ కాలనీ ప్రధాన రోడ్డులో డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. మురుగునీరు రోడ్డుపైకి చేరడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో ఉండలేని పరిస్థితి నెలకొందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.