హైదరాబాద్: 28°C
తెలంగాణ

TIMSలో విదేశీ రోగులకు ప్రత్యేక వార్డులు

MDCL: సనత్‌నగర్ మర్రి చెన్నారెడ్డి TIMS ఆసుపత్రిలో విదేశీ రోగుల కోసం ప్రత్యేక వార్డులను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు. తొలి విడతలో 582 పడకలతో వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులతో పోలిస్తే తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించడమే ఈ ప్రత్యేక విభాగాల ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.