AKP: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున డిసెంబర్ 3 వరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను రద్దు చేసినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ శనివారం తెలిపారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డిసెంబర్ 3 వరకు పీజీఆర్ఎస్ రద్దు


