SRCL: వేములవాడలో అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు, బీఆర్ఎస్ నాయకులు సబ్స్టేషన్ ఎదుట ఇవాళ ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పంటలకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన


