SRD: జిల్లాలోని సంగారెడ్డి టౌన్, హత్నూర, పుల్కల్, జహీరాబాద్, సదాశివపేట రూరల్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వరి పొట్ట దశలో ఉండటంతో నీటి అవసరం పెరిగింది. ఈ సమయంలో లో వోల్టేజీ కారణంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండటంతో సాగుకు ఆటంకం ఏర్పడుతోంది. మరమ్మతుల కోసం విద్యుత్ సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ
విద్యుత్ సిబ్బంది తీరుపై రైతుల ఆగ్రహం


