హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరుకుపల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

BPT: చెరుకుపల్లి సమీపంలో శనివారం ఓ విషాద ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఒక షెడ్డులో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఆత్మహత్యకు గల కారణాలు, ఇతర పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.