WNP: 8వ వార్డు శ్రీనివాసపురం బుడగ జంగాల కాలనీలో వారం రోజులుగా తాగునీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్, సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
వారం రోజులుగా తాగునీరు బంద్!


