హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవాని అలంకరణలో పాల్గొన్న ఎమ్మెల్యే

HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కుమ్మరిగూడలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు నిర్వహించిన భవాని అలంకరణలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, కంటోన్మెంట్ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించారు.