BDK: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని గోశాల నిర్మాణానికి పట్టణానికి చెందిన రాహుల్ దేవరాజ్, ఆశ్రిత దంపతులు శనివారం రూ.1,00,116 విరాళంగా అందజేశారు. నగదు చెక్కును ఆలయ అధికారులకు అందించారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు దంపతులకు తీర్థప్రసాదాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
భద్రాద్రి గోశాల నిర్మాణానికి ఆర్థిక సాయం


