విజయనగరం జిల్లా కేంద్రంలో రాజీవ్ క్రీడా మైదానంలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను ఎస్పీ దామోదర్, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది కేటాయింపు, బారికేడింగ్, స్ట్రాంగ్ రూమ్ల భద్రత అంశాలపై సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామితో ఏర్పాట్లపై ఆయన చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు


