KMM: వైరాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దసరా సెలవులపై ఇంటికి వచ్చిన రాఘవ (19) గుండెపోటుతో తల్లిదండ్రుల ఎదుటే ప్రాణాలు కోల్పోయాడు. HYDలో ఇంజినీరింగ్ చదువుతున్న రాఘవ రెండు రోజుల క్రితమే ఇంటికి చేరుకున్నాడు. దుస్తులు అమ్మేందుకు వచ్చిన వ్యక్తిని చూసి బయటకు వచ్చిన రాఘవ.. తల్లిదండ్రులతో మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుమారుడి మరణంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.
తెలంగాణ
తల్లిదండ్రుల కళ్లెదుటే కొడుకు మృతి


