SRPT: ప్రజలకు తాగునీరు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని నడిగూడెం మండల ప్రత్యేక అధికారి దామోదర్రెడ్డి ఈ రోజు సూచించారు. విద్యుత్ సరఫరా, ఉపాధి హామీ పనులు, వైద్య ఆరోగ్య సేవల్లో ఇబ్బందులు కలగకుండా సూక్ష్మ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో మల్సూర్ నాయక్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
‘ప్రజా సమస్యలపై ముందస్తు చర్యలు చేపట్టాలి’


