హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు..!

VSP: కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం హార్బర్ సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని హార్బర్ ఏసీపీ చిట్టిబాబు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, మైక్ సెట్ల వినియోగం నిషిద్ధమని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, ఓటర్లకు డబ్బు, మద్యం ద్వారా ప్రలోభాలు కల్పించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.