NLG: త్రిపురారం మండలంలో ఈరోజు మధ్యాహ్నం కురిసిన వర్షంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా, వర్షం కురవడంతో ఎండ తీవ్రత తగ్గింది. ఉక్కపోత నుంచి ఉపశమనం లభించడంతో ప్రజలు ఊరట చెందారు. వర్షపు జల్లులతో పంటలకు మేలు జరుగుతుందని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. వాతావరణం చల్లబడటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: భారి వర్షం.. చల్లబడిన వాతావరణం


