హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళ పోగొట్టుకున్న బ్యాగును అప్పగించిన పోలీసులు

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ మహిళ షాపింగ్ మాల్ వద్ద ఆటో ఎక్కి విద్యానగర్‌లో దిగే సమయంలో బ్యాగును ఆటోలోనే మర్చిపోయింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టూటౌన్ క్రైమ్ పోలీసులు ఆటో డ్రైవర్ అవూదుర్తి బాబును గుర్తించి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆటో యూనియన్ సమక్షంలో బాధితురాలికి అందజేశారు. వేగంగా స్పందించిన క్రైమ్ టీం సిబ్బందిని సీఐ సృజన్ రెడ్డి అభినందించారు.