హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడెల్లి జాతరకు 250 మందితో పోలీసు బందోబస్తు

NRML: దిలావర్‌పూర్ మండలం సాంగ్వి సమీపంలోని గోదావరి నది వద్ద నిర్వహించనున్న అడెల్లి గంగనీళ్ల జాతరకు 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP జి. జానకి షర్మిల తెలిపారు. భక్తుల రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ , నది వద్ద భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసులకు సూచించారు. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ సురక్షితంగా జాతరలో పాల్గొనాలని కోరారు.