హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫామ్ పాండ్లతో నీటి కొరతకు చెక్: కలెక్టర్

MDK: వర్షపు నీటిని ఒడిసిపట్టి, భూగర్భ జల మట్టాలను పెంచేందుకు వీబీ–జీ రామ్ జీ పథకం కింద ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. శనివారం కొత్తపల్లిలో ఉపాధి హామీ పనులను ఆమె పరిశీలించారు. ప్రతి పంచాయతీలో ఐదు ఫామ్ పాండ్లను ఎంపిక చేసి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలని సూచించారు.