హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ

కృష్ణా: మచిలీపట్నంలో పలు నామినేషన్ కేంద్రాలను డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని, నామినేషన్ల స్వీకరణ ప్రశాంత వాతావరణంలో జరుగుతోందని డీఎస్పీ తెలిపారు.