హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ సీనియర్ నేతకు ఘన నివాళులు

SKLM: నరసన్నపేటలో వైసీపీ సీనియర్ నేత పంచిరెడ్డి లింగమూర్తి సంతాప సభకు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన రామదాస్, డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య శనివారం హాజరయ్యారు. లింగమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. అనంతరం కుమారుడు పంచిరెడ్డి రాజారావును పరామర్శించి కుటుంబానికి సానుభూతి తెలిపారు.