హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాద్‌నగర్‌–హేమాజీపూర్‌ బస్సులు పెంచాలని వినతి

RR: షాద్‌నగర్ నుంచి బూర్గుల మీదుగా హేమాజీపూర్ వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించి, బస్సుల సంఖ్య పెంచాలని బూర్గుల సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుమ్మరి శ్రీను ఆర్టీసీ డీఎంకు వినతిపత్రం అందజేశారు. గతంలో గంటకో బస్సు నడిచేదని, కరోనా తర్వాత సర్వీసులు తగ్గడంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.