హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు కురుక్యాల విద్యార్థినులు

KNR: కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్‌-14 హ్యాండ్‌బాల్ పోటీల్లో కురుక్యాల జడ్పీ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. 8వ తరగతి విద్యార్థిని రిషిత, 7వ తరగతి విద్యార్థిని సిమ్రాన్ ఖాతూన్ మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం ఎర్రోజు లక్ష్మయ్య తెలిపారు.