హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 22న ఘనంగా శ్రీ పండుగ సాయన్న జయంతి వేడుకలు

ADB: ఆదిలాబాద్‌లో ఈ నెల 22న శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు. ఉదయం 10:30 గంటలకు యాక్సిస్ బ్యాంక్ ఎదురుగా ఉన్న విగ్రహానికి పూలమాల నివాళి అర్పించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఉదయం 11:00 గంటలకు కలెక్టర్ సమావేశ మందిరంలో జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు.