JGL: వెట్టిచాకిరిపై పూర్తి అవగాహన తేవడమే లక్ష్యమని అడిషనల్ కలెక్టర్ ప్రసూనాంబ అన్నారు. జగిత్యాలలో శనివారం వెట్టిచాకిరిపై అవగాహన కల్పించే ప్రచార రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం జిల్లాలో తిరిగి కార్మికులకు తమ హక్కులు, ఫిర్యాదు విధానాలపై అవగాహన కల్పిస్తుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్మిక కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
వెట్టిచాకిరిపై పూర్తి అవగాహన తేవడమే లక్ష్యం: అ. కలెక్టర్


