హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాల వద్ద 163 సెక్షన్: కలెక్టర్

KDP: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాలోని అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు చేస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరకుండా నిబంధనలు పాటించాలన్నారు. నిబందనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.