హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల CMRF అందజేత

MNCL: అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల 38వ డివిజన్‌కు చెందిన బత్తుల మల్లేశ్ కుటుంబానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అండగా నిలిచారు. మల్లేశ్ వైద్య చికిత్స కోసం CMRF కింద రూ.2 లక్షల విలువైన పత్రాన్ని మల్లేష్ కుటుంబ సభ్యులకు శనివారం అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.