హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద రద్దీ

KKD: పిఠాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం పురపాలక కార్యాలయం వద్ద రద్దీ నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు ఇంటి పన్నులు, కుళాయి పన్నులతో పాటు ఇతర బకాయిలు చెల్లించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానికులు సైతం పన్నుల చెల్లింపులకు రావడంతో కార్యాలయం వద్ద క్యూ లైన్లు భారీగా కనిపించాయి.