హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మందుల దుకాణాల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు

అన్నమయ్య: చిట్వేల్ మందుల దుకాణాల్లో జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు నిర్వహించారు. మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్‌ఆర్‌ఎక్స్ మందులు, ప్రెగ్నెన్సీ కిట్లు విక్రయించరాదని సూచించారు. గడువు ముగిసిన మందులు, ఫిజీషియన్ శాంపిల్స్ దుకాణాల్లో ఉంచకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.