హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు కొత్తపేటలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

గుంటూరు నగరంలోని మూడు వంతెనలు, కొత్తపేట, రంగా బొమ్మ సెంటర్‌ ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.