హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురం 9వ వార్డు TDP అభ్యర్థిగా కొల్లు

W.G: నరసాపురం మున్సిపాలిటీ 9వ వార్డు TDP కౌన్సిలర్ అభ్యర్థిగా రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఆఫీసులో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన అధికారికంగా పత్రాలు సమర్పించారు. రాష్ట్ర స్థాయి పదవిలో ఉంటూనే స్థానిక వార్డు ఎన్నికల బరిలోకి దిగడంపై పట్టణంలో విస్తృత చర్చ సాగుతోంది.