హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదో తరగతిలో ప్రతిభ.. ట్రిపుల్ ఐటీలో సీటు

KMM: పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన సత్తుపల్లి యూపీఎస్ విద్యార్థిని తులసిని మాజీ TGIDC చైర్మన్ మువ్వా విజయ్‌బాబు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తులసిని అభినందిస్తూ, విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. కుమార్తె విజయంపై తల్లిదండ్రులు చింతల వాసు, సునీత హర్షం వ్యక్తం చేశారు.