హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్ రిజర్వుడ్‌గా ప్రకటించడంపై ఆందోళన

ASR: జిల్లా ఐదో షెడ్యూల్ ప్రాంతంలో 17 ఎంపీటీసీ స్థానాలను అన్ రిజర్వుడ్‌గా ప్రకటించడంపై అరకు జేఏసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఆదివాసీల రాజకీయ ప్రాతినిధ్యానికి భంగమని, ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని శనివారం డిమాండ్ చేసింది. రాజ్యాంగ నిబంధనలు పాటించి రిజర్వేషన్లను సమీక్షించాలని, లేకుంటే ఆందోళనలు చేస్తామని జేఏసీ కన్వీనర్ సమర్ధి గోపాల్ హెచ్చరించారు.