హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి'

VKB: రాష్ట్రంలోని నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి, వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్ డిమాండ్ చేశారు. యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, రైతులకు అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.