హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాసంగి పంటలపై అవగాహనా సదస్సు

NZB: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో యాసంగి పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోన్పేట్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఏఈఓ భూమేశ్వర్ పంటల ఎంపిక, నీటి వినియోగం, వ్యవసాయ యాజమాన్య పద్ధతులపై వివరించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.