అన్నమయ్య: రాయచోటి మున్సిపాలిటీ వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి జిన్నా షరీఫ్ వ్యక్తిగత రక్షకులుగా ఉన్న బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీరంతా పంజాబ్ రాష్ట్రానికి చెందినవారిగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
రాయచోటిలో బౌన్సర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు


