హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాల్మీకి నగర్‌లో మౌలిక సదుపాయాల కొరత

ADB: ఆదిలాబాద్‌‌లోని వాల్మీకి నగర్‌ కాలనీలో మౌలిక సదుపాయాల కొరత స్థానికులను వేధిస్తోంది. కాలనీ ఏర్పడి 16 ఏళ్లు, మున్సిపాలిటీలో విలీనమై ఎనిమిదేళ్లు గడిచినా అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని వాపోతున్నారు. ఏడాది క్రితం నిర్మించిన సీసీ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలు ఏర్పాటు చేయకపోవడంతో పక్క గల్లీలోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.