హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెల్మెట్‌ లేకుంటే జరిమానా తప్పదు: ఎస్‌ఐ

ASF: ఆసిఫాబాద్‌ పట్టణంలోని ఆదిలాబాద్‌ ఎక్స్‌రోడ్డు వద్ద శనివారం ఎస్‌ఐ బొజ్జిరావు పోలీసు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. రహదారి భద్రత కోసం ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని తెలిపారు.