హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసన్నపేట SBI శాఖలో ఖాతాదారుల అవస్థలు

SKLM: నరసన్నపేట SBI శాఖలో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. రూ.30 వేల లోపు డిపాజిట్లకు బయట కౌంటర్ కు పంపిస్తున్నారని వాపోతున్నారు. వృద్ధులు, మహిళలు ఎండలో నిలబడి డిపాజిట్ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట భద్రత లేక డబ్బు పోతే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బ్యాంకు లోపలే సేవలు కల్పించాలని కోరుతున్నారు.