హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాలతో జీవం పోసుకున్న పంట పొలాలు

BPT: వేటపాలెం(M) కొత్తపేటలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి పంటను ఎద పద్ధతిలో సాగు చేసిన రైతులకు ఈ వర్షాలు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఇప్పటివరకు వర్షాలు లేక పంటలు ఎండిపోతాయేమోనని ఆందోళన చెందిన రైతులు, తాజా వర్షాలతో ఊరట పొందారు. పంటలకు మరింత మేలు జరగాలని, వర్షాలు కొనసాగాలని కోరుకుంటున్నారు.