నంద్యాల ఓల్డ్ టౌన్లోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పుష్పాలు, రంగురంగుల అలంకరణలతో అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల సందడితో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక అలంకరణలో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు


