KDP: మరియాపురం నామినేషన్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగి దాడులకు దిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ దాడిలో వైసీపీ మాజీ డిప్యూటీ మేయర్ తనయుడిపై కత్తితో దాడి చేసినట్లు పేర్కొన్నారు. కాగా, పక్కనే ఉన్న పోలీసు సిబ్బంది స్పందించి ఇరు వర్గాలను చెదరగోట్టారు. ఈ ఘర్షణపై ఇరు పార్టీల అధినేతలు ఆరా తీసినట్లు నాయకులు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ మాజీ డిప్యూటీ మేయర్ తనయుడిపై కత్తిపోట్లు


