RR: షాద్నగర్ రైతు కాలనీలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు త్వరలోనే సీసీ రోడ్ల నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాలు కల్పించి, రైతు కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణ
రైతు కాలనీ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే


