TPT: వరదయ్యపాలెం మండలం సంతవేలూరుకు చెందిన వైసీపీ నేత, మాజీ సింగిల్ విండో ఛైర్మన్ పరంధాంరెడ్డి టీడీపీలో చేరారు. ఆర్ఆర్ కళ్యాణ మండపంలో శనివారం జరిగిన టీడీపీ కార్యవర్గ సమావేశంలో మండల అధ్యక్షుడు యుగంధర్రెడ్డి, ఇతర నాయకుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై టీడీపీలో చేరినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల వేళ వైసీపీకి షాక్


