హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు

ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక కందులాపురం సెంటర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున శనివారం రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడిగారు. అలాగే రాజకీయ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించారు. ఎన్నికల నియమావళిని అమలు చేసే ప్రక్రియలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.