ప్రకాశం: దసరా నవరాత్రులలో భాగంగా ఏడవ రోజు శనివారం కామేపల్లిలోని పోలేరమ్మ తల్లి దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. జరుగుమల్లి మండలం కామేపల్లిలో ప్రసిద్ధిగాంచిన పోలేరమ్మ తల్లి ఆలయానికి జిల్లాలో పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఛైర్మన్ పోటు పెదబాబు, ఈవో బైరాగిచౌదరి తగు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గాదేవి అలంకరణలో పోలేరమ్మ తల్లి


