GNTR: ప్రత్తిపాడులో జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శనివారం పర్యటించారు. కోయవారిపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. జేసీ పర్యటనలో ఆయన వెంట స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్తిపాడులో జాయింట్ కలెక్టర్ పర్యటన


