హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో భారీ వర్షం.. నామినేషన్లకు అంతరాయం

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా వాతావరణం మారింది. భారీ వర్షం కురుస్తోంది. మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ల కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది. నామినేషన్ల ప్రక్రియకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నామినేషన్ల డెస్క్‌ను మరో అంతస్తులోకి మార్చి యథావిధిగా నామినేషన్లు స్వీకరిస్తున్నారు.