హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మారంలో పువ్వుల సందడి

PDPL: ధర్మారం మండల కేంద్రంలో శనివారం పువ్వుల సందడి నెలకొంది. ఆదివారం రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా వ్యాపారులు రోడ్లకు ఇరువైపులా పలు రకాల పువ్వులు విక్రయానికి ఉంచారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ధర్మారం చేరుకోవడంతో రోడ్లు జన సంద్రగా మారాయి. పువ్వులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. బంతిపూలు కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు.