హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అక్షయ పాత్ర వాహనాలకు దుర్గాభవాని పూజ

SRD: కంది మండల పరిధిలోని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేసే అక్షయ పాత్ర వాహనాలకు శ్రీ దుర్గాభవాని పూజ నిర్వహించారు. విద్యార్థులకు ఆహారం తీసుకెళ్లే వాహనాలు, వాటి డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ పూజా కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.